Psalm 119:11(Hiding God’s word in our heart so that we will not sin)
11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
Deut 6:6(God’s commandments are to be on our hearts)
6 నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.Job 22:22
22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుముఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
Isa 51:7(Taking God’s instruction to heart is right)
7 నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి.
Jer 31:33(we will be God’s people when we write His law in our hearts)
33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
Psalm 37:31(when we have God’s law in our hearts, our feet do not slip)
31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.
Psalm 40:8(we desire to do your will, my God; your law is within our heart.)
8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.
Pro 3:3(let Love and faithfulness be on our heart)
3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.