Friday, August 5, 2011

God created the heavens and the earth

Psalm 115:16
                16 ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
Psalm 89:11
                11 ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.

Deut10:14
                14 చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.
Ne 9:6
            6 నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.

Job 35:5
                5 ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.
Psalm 8:3
                3 నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
Psalm 104:3
                3 జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు

No comments:

Post a Comment