Psalm 118:7(Lord is our helper)
7 యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.
Deut 33:29(God is our shield and helper and your glorious sword)
29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
Heb 13:6(The Lord is our helper)
6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.Psalm 115: 9-11(God is their help who trust in the Lord)
9 ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
10 అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
11 యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
10 అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
11 యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
Isa 45:24(In the LORD alone are deliverance and strength)
24 యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు
Hos 13:9(we should not be against our helper)
9 ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.
Hab 3:19(Lord is our strength and enables us to tread on the heights)
19 ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును. Psalm 30:10(Lord, be our help)
10 యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము
No comments:
Post a Comment